Galaxy Wearable గోప్యతా ప్రకటన చివరిగా అప్‌డేట్ చేయబడినది: ఏప్రల్ 1, 2021 Samsung Electronics Co., Ltd వద్ద, మా వినియోగదారులకు గోప్యత ఎంత ముఖ్యమో మాకు తెలుసు. మేము మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎలా సేకరిస్తామో, ఉపయోగిస్తామో మీకు అర్థమయ్యేలా చూసుకోవడానికి గాను మేము ఈ గోప్యతా ప్రకటనను సృష్టించాము. https://account.samsung.com/membership/terms/privacypolicy వద్ద వీక్షించగల మా గోప్యతా విధానం, మీ Galaxy Wearable యొక్క మీ వాడుకకు కూడా వర్తిస్తుంది. మేము మీ డేటాను ఎలా ఉపయోగిస్తాము అనే దాని గురించి మరింత సమాచారం మా గోప్యతా విధానంలో ఉంది. మమ్మల్ని ఎలా సంప్రదించాలి అనే దాని గురించి సమాచారాన్ని కూడా ఇది కలిగి ఉంది. దయచేసి ఈ గోప్యతా ప్రకటనకు అదనంగా మా గోప్యతా విధానాన్ని చదవండి. అయినప్పటికీ, అన్ని సమయాలలోనూ ఈ గోప్యతా ప్రకటన గోప్యతా విధానం కంటే ముందు ఉంటుంది. మేము ఏ సమాచారాన్ని సేకరిస్తాం? మీ Galaxy Wearable ద్వారా, మేము మీ గురించి వివిధ మార్గాల్లో సమాచారాన్ని సేకరించి మరియు నిర్వహిస్తాము. మీరు నేరుగా అందించే సమాచారం •మీరు మీ Galaxy Wearable పరికరంపై Samsung account కు లాగ్ ఇన్ అయినప్పుడు, మీ Samsung account ఐడి వంటి Samsung account సమాచారం. మీ Galaxy Wearable యొక్క మీ వాడుక గురించిన సమాచారం •పరికరం రకం, పరికరం మోడెల్, OS రకం మరియు వెర్షన్, పరికరం ఐడెంటిఫైయర్‌లు మరియు ఇతర విశిష్ట ఐడెంటిఫైయర్‌లు, మొబైల్ నెట్‌వర్క్ ప్రదాతలు, పరికరం కాన్ఫిగరేషన్‌లు మరియు సెట్టింగ్‌లు వంటి మీ పరికరాల గురించి సమాచారం; •GPS, బ్లూటూత్ మరియు WiFi సిగ్నల్స్ ద్వారా మీ స్థానానికి సంబంధించిన సమాచారం. మీ Galaxy Wearable యొక్క కొన్ని అంశాలకు మీ పరికరం యొక్క ఖచ్చితమైన భౌగోళిక స్థానం యొక్క సేకరణ అవసరం, మరియు ఆ సందర్భాలలో మేము మీ భౌగోళిక స్థానాన్ని సేకరిస్తాము, కానీ మీ అనుమతితో మాత్రమే. ఒక Galaxy Wearable అంశం మీ ఖచ్చితమైన భౌగోళిక స్థానాన్ని సేకరించాల్సిన అవసరం వచ్చినప్పుడు మీ పరికరం మీకు తెలియజేస్తుంది. ఒకవేళ మీరు మీ ఖచ్చితమైన భౌగోళిక స్థానాన్ని సేకరించడానికి Galaxy Wearable ని అనుమతించకపోతే, మీరు Galaxy Wearable యొక్క అన్ని లక్షణాలను ఉపయోగించలేరు అని దయచేసి గమనించండి; •మీరు ఒక రిమోట్ కనెక్షన్ అంశాన్ని ఉపయోగించినప్పుడు (మీ మొబైల్ పరికరాన్ని మీ Galaxy Wearable పరికరానికి బ్లూటూత్ కాకుండా Wi-Fi ద్వారా లేదా మొబైల్ డేటా ద్వారా కనెక్ట్ చేయడం ద్వారా మీ Galaxy Wearable మీ ఫోన్ నుండి సందేశాలను స్వీకరించగలగడం వంటిది); నోటిఫికేషన్‌లు మరియు అందుకున్న సందేశాలు మరియు ఇమెయిల్‌ల కంటెంట్ (సందేశాలు మరియు మీడియా ఫైల్‌ల కంటెంట్‌తో సహా) వంటి మీ మొబైల్ పరికరంలో ఇన్‌స్టాల్ చేయబడిన అప్లికేషన్‌ల గురించిన సమాచారం; మరియు • ఒకవేళ మీరు బ్యాకప్ మరియు పునరుద్ధరణ అంశము, సాఫ్ట్ వేర్ వెర్షన్, సేల్స్ కోడ్, ఇన్‌స్టాల్ చేసిన మరియు ఇటీవల ఉపయోగించిన అప్లికేషన్‌లు అనువర్తనాల జాబితా, ఇన్‌స్టాల్ చేసిన అప్లికేషన్‌ల డేటా మరియు సెట్టింగులు, గడియార ముఖం, అప్లికేషన్‌లు మరియు విడ్జెట్‌లు, నోటిఫికేషన్ సెట్టింగులతో సహా హోమ్ స్క్రీన్ సెట్టింగులు, ప్రదర్శన, ధ్వని మరియు వైబ్రేషన్‌‌తో సహా సిస్టమ్ సెట్టింగ్‌‌లను ఉపయోగిస్తే. •ఒకవేళ మీరు విశ్లేషణ డేటా, డయాగ్నొస్టిక్, టెక్నికల్, దోషం, మరియు మీ Galaxy Wearable యొక్క మీ వాడకం యొక్క సమయం మరియు వ్యవధి వంటి వాడకం సమాచారం, మీరు ఇన్‌స్టాల్ చేసిన అప్లికేషన్‌లు మరియు మీరు ఎంతసేపు మరియు ఎప్పుడు మీరు అప్లికేషన్‌లను తెరిచారు లేదా మూసివేశారు అనే సమాచారాన్ని పంపించడానికి మీరు అంగీకరించినట్లయితే. మేము మీ గురించి, మీ Galaxy Wearable మరియు అప్లికేషన్‌ల గురించి, Galaxy Wearable కి అనుసంధానించబడిన మీ పరికరాలు మరియు మీ Galaxy Wearable వాడకం గురించిన ఇతర సమాచారమును కూడా మేము సేకరించవచ్చు, వీటిని సేకరించే సమయములో మేము మీకు వివరించే మార్గాల్లో సేకరించవచ్చు మరియు ఇది అవసరమైనప్పుడల్లా మేము మీ సమ్మతిని పొందుతాము. మీ సమాచారాన్ని మేమెలా ఉపయోగిస్తాం? • మీ Galaxy Wearable కోసం మీరు రిజిస్టర్ చేసుకోవడానికి మరియు ఉపయోగించడానికి సహాయపడుట. • మీరు కోరిన సేవలు మరియు అంశాలను అందించుట. • మీ అభ్యర్థనలు మరియు ప్రశ్నలకు ప్రతిస్పందించుట మరియు మీ Galaxy Wearable కి సంబంధించిన సాంకేతిక మద్దతును మీరు అభ్యర్థించినప్పుడు సహాయం అందించడంతో సహా మీ Galaxy Wearable గురించి మీతో కమ్యూనికేట్ చేయుట. • ఎంపిక చేసుకున్న Samsung లేదా మూడవ పక్ష అప్లికేషన్‌లతో, ఫీచర్లతో మరియు సేవలతో మీరు పరస్పరం సంభాషించేందుకు అనుమతించుట. ఉదాహరణకు, మీరు మీ అప్లికేషన్‌లు మరియు సెట్టింగ్‌ల సమాచారాన్ని Samsung Cloudకు బ్యాకప్ చేయవచ్చు లేదా మీ Galaxy Wearable పై Samsung Health ని ఉపయోగించవచ్చు. • మీ Galaxy Wearable కి సంబంధించిన అనుకూలీకరించిన కంటెంట్ మరియు సేవలను అందించుట. • ప్రత్యక్ష మార్కెటింగ్ కమ్యూనికేషన్‌ల (పుష్ నోటిఫికేషన్‌ల ద్వారా, ఇమెయిల్‌లు మరియు టెక్స్ట్‌ సందేశాలు వంటివి) ద్వారా ప్రచారాలు మరియు ఆఫర్‌లను అందించడం కోసం, మీరు విడిగా మాకు సమ్మతి ఇచ్చినప్పుడు మాత్రమే. • Galaxy Wearable ని అలాగే మా వ్యాపారాన్ని (కొత్త ఉత్పత్తులు మరియు సేవలను వృద్ధిచేయడం; మా ఉత్పత్తుల్ని మరియు సేవల్ని అధికం చేసి మెరుగుపర్చడం; మా కమ్యూనికేషన్లను నిర్వహించడం ; మా ఉత్పత్తులు, సేవలు మరియు కస్టమర్ పునాదిని విశ్లేషించడం; మార్కెట్ పరిశోధన నిర్వహించడం; డేటా అనలిటిక్స్ ని నిర్వర్తించడం; అకౌంటింగ్, ఆడిటింగ్ మరియు ఇతర అంతర్గత ప్రక్రియల్ని నిర్వర్తించడం వంటి వాటితో సహా) ఆపరేట్ చేయడం, మదింపు చేయడం మరియు మెరుగుపరచడం. • మా ఉత్పత్తులు మరియు సేవల గురించి మీ అభిప్రాయాల కోసం మిమ్మల్ని అడగడం మరియు కస్టమర్ సర్వేలను నిర్వర్తించడం; ఒకవేళ అది అవసరమైతే, మీ ప్రత్యేక సమ్మతితో. • సాఫ్ట్‌వేర్ నవీకరణలు, నిర్వహణ సేవలు మరియు మీ Galaxy Wearable కొరకు మద్దతు ఇవ్వడం. •మోసం మరియు ఇతర నేర కార్యకలాపాలు, క్లెయిములు మరియు ఇతర నష్టబాధ్యతల నుండి రక్షించడం, గుర్తించడం మరియు నిరోధించడం. • ఈ గోప్యతా ప్రకటన, గోప్యతా విధానంతో సహా వర్తించే చట్టబద్ధమైన ఆవశ్యకతలతో, తగిన పారిశ్రామిక ప్రమాణాలు మరియు మా పాలసీలతో సమ్మతి వహించడం మరియు వాటిని అమలు చేయడం. మీ Galaxy Wearable ఇతర Samsung లేదా మూడవ పార్టీ అప్లికేషన్‌లు, సేవలు మరియు అంశాలకు కనెక్ట్ అయ్యే లేదా ఉపయోగించగల సామర్థ్యాన్ని అందించవచ్చు. ఉదాహరణకు, మీరు మీ Galaxy Wearable పరికరంలో Samsung Health లేదా Bixby Voice ‌ని ఉపయోగించగలుగుతారు. ఈ Samsung మరియు మూడవ పార్టీ అప్లికేషన్‌లు, సేవలు మరియు అంశాలు వాటి స్వంత గోప్యతా నోటీసులను కలిగి ఉండవచ్చు. ఆ సేవలు మీ సమాచారాన్ని ఎలా ప్రాసెస్ చేస్తాయో మీరు చక్కగా అర్థం చేసుకోవడానికి వీలుగా దయచేసి మీరు వాటిని సమీక్షించండి. లింక్ చేయబడిన లేదా చూపించబడిన ఏ ఇతర అప్లికేషన్‌, సేవ లేదా ఇతర అంశం మా స్వంతం కాకపోతే లేదా మేము అధుపు చేసేది కాకపోతే, దాని కంటెంటుకు, వాడుకకు లేదా గోప్యతా వ్యవహారాలకు మేము బాధ్యులం కాదు. మేము మీ సమాచారాన్ని ఎవరితో పంచుకుంటాము? మేము మీ సమాచారాన్ని అంతర్గతంగా మా వ్యాపారంలో మరియు క్రింది ప్రతిపత్తులకు వెల్లడిస్తాము, ఐతే పైన వివరించిన ప్రయోజనాల కోసం మాత్రమే. * అనుబంధ సంస్థలు: మేము నియంత్రించే లేదా మా యాజమాన్యంలోని ఇతర Samsung Electronics Group కంపెనీలు; * సేవా ప్రదాతలు (సర్వీసు ప్రొవైడర్లు): మా తరపున డేటాను నిర్వహించే డేటా సర్వర్‌ల వంటి మా కొరకు లేదా మా తరపున సేవలను అందించడానికి జాగ్రత్తగా ఎంపిక చేసిన కంపెనీలు. ఈ ప్రదాతలు కూడా మీ సమాచారాన్ని సంరక్షించేందుకు కట్టుబడి ఉంటారు; * చట్టం ద్వారా అవసరమైనప్పుడు లేదా మీ Galaxy Wearable ని రక్షించడానికి అవసరమైనప్పుడు ఇతర పక్షాలు: ఉదాహరణకు, మీ సమాచారాన్ని వెల్లడించడానికి చట్టం, చట్టపరమైన ప్రక్రియ లేదా ప్రభుత్వ అధికారుల నుండి కోర్టు ఉత్తర్వుల ద్వారా ఇది అవసరం కావచ్చు. చట్టాన్ని అమలు చేయడం, జాతీయ భద్రత, తీవ్రవాదంపై పోరాటం లేదా ప్రజా భద్రతకి సంబంధించిన ఇతర సమస్యల కోసం వారు మా నుండి మీ సమాచారాన్ని కోరవచ్చు; * కార్పొరేట్ లావాదేవీలకు సంబంధించిన ఇతర పక్షాలు: ఒక విలీనం లేదా బదిలీ, స్వాధీనత లేదా విక్రయం లేదా దివాళా తీసిన సందర్భంలో మేము మూడవ పక్షానికి మీ సమాచారాన్ని వెల్లడించవచ్చు; మరియు * మీ సమ్మతి లేదా మీ నిర్దేశముతో ఇతర పక్షాలు: ఈ గోప్యతా విధానంలో వివరించిన వెల్లడింపులు మాత్రమే కాకుండా అదనంగా, మీరు విడిగా సమ్మతి ఇచ్చినప్పుడు లేదా అలా పంచుకోవడానికి మీరు అభ్యర్థించినప్పుడు మీ గురించి సమాచారాన్ని మేము మూడవ పక్షాలతో పంచుకోవచ్చు. ఈ గోప్యతా ప్రకటనకు ఆధునీకరణలు మీ Galaxy Wearable కోసం మీ సమాచారాన్ని మేము ఎలా సేకరిస్తాము మరియు ఎలా ప్రాసెస్ చేస్తాము అనేదాని గురించి మార్పులు లేదా సంబంధిత చట్టాలు మరియు నిబంధనలలో మార్పుల గురించి మీకు తెలియజేయడానికి ఈ గోప్యతా ప్రకటన ఆధునీకరించబడవచ్చు. ఈ డాక్యుమెంటును చివరి సారిగా ఆధునీకరించిన తేదీ ఈ గోప్యతా నోటీసు యొక్క పైభాగములో చూపించబడింది. Version:P01.03.00